- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కేంద్రం నిర్ణయం మార్చుకోకుంటే పార్లమెంట్‌కు కరెంట్ కట్!'
దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోకుంటే పార్లమెంట్ ముట్టడించడం తో పాటు పార్లమెంట్ భవనానికి విద్యుత్ సరఫరా లేకుండా చేస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. విద్యుత్ సవరణ బిల్ ను వ్యతిరేకిస్తూ బుధవారం నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో భారీ ఎత్తున ధర్నా జరిగింది. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆలిండియా జేఏసీగా ఏర్పడి ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, అన్ని యూనియన్ల ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొని తన నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి విద్యుత్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఆందోళనలో ఆర్. కృష్ణయ్య పాల్గొని విద్యుత్ ఉద్యోగులకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లు ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని విద్యుత్ ప్రైవేటు రంగం చేయడం వల్ల రైతులు, ప్రజలు నష్టపోతారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల నిత్యావసర ధరలు పెరుగుతాయని, ప్రైవేటీకరణ వల్ల అధిక ఛార్జీలు వసూలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత సబ్సిడీ కూడా ఎత్తివేసే ప్రమాదం ఉందని విద్యుత్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోం..
కస్టపడి నిర్మించుకున్న విద్యుత్ రంగాన్ని అప్పనంగా ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ అన్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన ప్రైవేటీకరణ చేయడం వల్ల రైతులతో పాటు, సామాన్య ప్రజలు, విద్యుత్ ఉద్యోగుల నష్టపోతారన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తే దేశవ్యాప్తంగా కరెంటును స్తంభింప చేస్తామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోకుంటే బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో పాటుగా త్వరలో పార్లమెంట్, అసెంబ్లీలను ముట్టడిస్తామని హెచ్చరించారు
Read More : డిసెంబర్ 6న కేంద్రం అఖిలపక్ష సమావేశం
- Tags
- Telang
- Telugunews