- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పార్టీ మళ్లీ గెలిస్తే దేశ ప్రగతి ఆగిపోతుంది : ప్రధాని మోడీ
భోపాల్ : దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా విధ్వంసాలే జరిగాయి తప్ప.. వికాసం జరగలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశాన్ని అభివృద్ధి ప్రయాణంలో వెనక్కి నెట్టేసిన కాంగ్రెస్ పార్టీ కనీసం మరో వందేళ్ల పాటు అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉందన్నారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ‘‘దేశ ప్రగతిని రివర్స్ గేర్‌లో తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌పర్ట్. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ దేశ పురోగతి ఆగిపోయే ముప్పు ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘ధనవంతుల ఇళ్లలో పుట్టిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పేదల జీవితాలు టూరిజం స్పాట్‌లలా కనిపిస్తాయి. అందుకే వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు విదేశీ ప్రతినిధులు వస్తే.. తీసుకెళ్లి మన మురికివాడలను చూపించేవాళ్లు’’ అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కీలక నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్‌లు ‘కొడుకుల భవిష్యత్తు’ అనే ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతున్నారని, అలాంటి వాళ్లు రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేరని విమర్శించారు.