- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కబాబ్ లలో కృత్రిమ రంగుల వాడకంపై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం
by Shamantha N |
X
దిశ, నేషనల్ బ్యూరో: గోబీ మంచూరియా, కాటన్ క్యాండీలపై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. కబాబ్ లల్లో కృత్రిమ రంగుల వాడకంపై నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృత్రిమ రంగుల్లో హానికరమైన రసాయనాలు ఉంటున్నాయని పేర్కొంది. వెజ్, నాన్ వెజ్ కబాబ్ ల తయారీలో కృత్రిమ రంగు వాడకుండా నిషేధం విధించినట్లు ఆహార భద్రతా విభాగం తెలిపింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కనిష్ఠంగా ఏడేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదు శిక్ష విధించనుంది. జైలు శిక్షతో పాటు రూ.10లక్షల వరకు జరిమనా పడనుంది. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 39 కబాబ్ శాంపిల్స్‌లో ఏడింటిలో హానికరమైన రసాయనాలు ఉన్నట్లు ఆహార భద్రతా విభాగం గుర్తించింది. ఆ రసాయనాల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంది. అందుకే, కబాబ్ లలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించినట్లు స్పష్టం చేసింది.
Advertisement
Next Story