నిలకడగా అధ్వానీ ఆరోగ్యం..ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

by Vinod |
నిలకడగా అధ్వానీ ఆరోగ్యం..ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ సీనియర్ నాయకుడు, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బుధవారం రాత్రి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. గత కొద్ది రోజులుగా అద్వానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే కాస్త ఇబ్బంది పడటంతో అస్పత్రిలో జాయిన్ చేసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అద్వానీని పరీక్షించిన వైద్యులు యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో చికిత్స అందించారు. అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండటంతో గురువారం ఆయనను డిశ్చార్జ్ చేసినట్టు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.

అంతకుముందు ఆద్వానీ ఆస్పత్రిలో చేరారన్న సమాచారంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. బీజేపీ అగ్రనాయకులు సైతం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అద్వానీ కుమారుడు జయంత్, కుమార్తె ప్రతిభతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలతోనూ సంప్రదింపులు జరిపి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. కాగా, అద్వానీని ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్నతో సత్కరించారు. ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటికి వెళ్లి పురస్కారం అందజేశారు.

Next Story

Most Viewed