- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
51 మంది మహిళా డ్రైవర్లు, కండక్టర్లతో 'మిషన్ మహిళా సారథి ' ప్రారంభం!
- జెండా ఊపి ప్రారంభించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నవరాత్రి 'మహా అష్టమి' సందర్భంగా 'మిషన్ మహిళా సారథి'ని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. యూపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన మొత్తం 51 బస్సు సర్వీసులను సీఎం యోగి ఆదిథ్యనాథ్ ప్రారంభించారు. ఆయా బస్సులన్నిటికీ డ్రైవర్లు, కండక్టర్లు అందరూ మహిళలే ఉండనున్నారు. తన అయోధ్య పర్యటనలో రెండవ రోజు, ముఖ్యమంత్రి రామ్ కథా పార్క్ వద్ద ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఒక సమాజ సర్వతోముఖాభివృద్ధికి స్త్రీలను గౌరవించాలని, వారి గౌరవాన్ని కాపాడాలని చెప్పారు. మహిళల స్వావలంబనకు కృషి చేయడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే, మహిళలు అన్ని ఉద్యోగాలు చేయలేరనే అభిప్రాయం తప్పని, దాన్ని రుజువు చేస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరూపించింది. మహిళా డ్రైవర్లు, కండక్టర్లతో ఈ బస్సులు నడవడం గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలోని పోలీసు, ఇతర శాఖలు కలిపి మొత్తం 1.5 లక్షల మంది స్త్రీలకు ఉద్యోగాలు కల్పించామని, దీనికి కొనసాగింపుగానే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహిళా డ్రైవర్లు, కండక్టర్లను నియమించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం అయోధ్యలోని ఛోటీ దేవ్‌కాళీ ఆలయంలో పూజలు నిర్వహించారు.