OTT: అశ్లీల కంటెంట్.. ఓటీటీలకు కేంద్రం వార్నింగ్

by Prasad Jukanti |
OTT: అశ్లీల కంటెంట్..  ఓటీటీలకు కేంద్రం వార్నింగ్
X

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: నైతిక విలువలు పాటించాల్సిందేనని ఓటీటీ (OTT) ఫ్లాట్ ఫామ్ లను కేంద్ర ప్రభుత్వం (Central Govt) హెచ్చరించింది. ఐటీ రూల్స్ (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను ఓటీటీలు,సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ తప్పనిసరిగా పాటించాలని, చిన్నారులకు 'ఏ' రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది. ఈ మేరకు గురువారం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ లపై ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఐటీ రూల్స్ లోని 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఈ నిబంధనలు బ్రేక్ చేస్తూ ఏ కంటెంట్ ను ప్రసారం చేయవద్దు. వయసు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని స్వీయనియంత్రణ కలిగి ఓటీటీలు నైతిక విలువలను పాటించాలని ఆదేశించింది. కాగా 'ఇండియాస్ గాట్ లాటెంట్' కార్యక్రమంలో రణ్ వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పార్లమెంట్ లోనూ రచ్చ జరిగింది. ఈ క్రమంలో ఓటీటీ కంటెంట్ పై ఇటీవల సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed