J&K: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాకు అదనపు బలగాలు

by Harish |   ( Updated:2024-08-11 12:42:58.0  )
J&K: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాకు అదనపు బలగాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివితే లక్ష్యంగా సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్న భారత భద్రతా బలగాలపై శనివారం ముష్కరులు కాల్పులు జరపగా ఇద్దరు జవాన్లు, ఒక పౌరుడు మరణించిన నేపథ్యంలో తాజాగా అనంత్‌నాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులను ఏరివేసేందుకు తమ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. అహ్లాన్ గగర్మాండు అటవీ ప్రాంతానికి అదనపు సిబ్బందిని తరలించారు. ప్రస్తుతం గాగర్‌మాండు ఎగువ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ ముగిసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాశ్మీర్ జోన్ వికె బిర్డి చెప్పారు.

ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని, ఇప్పుడు ఉన్న బలగాలకు అదనంగా మరికొంతమందిని చేర్చాం. వాతావరణ సవాళ్లు ఉన్నప్పటికీ కూడా సిబ్బంది వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నారని, లోయ స్థలాకృతి ఆపరేషన్‌కు కొంత ఇబ్బందిగా మరిందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే శనివారం అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు మరణించాడు. మరో ఇద్దరు చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఎన్‌కౌంటర్ జరుగుతున్న సమయంలో ఇద్దరు పౌరులు అక్కడ ఉండటంపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed