- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమిటీని మేమే నియమిస్తాం.. అదానీ వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అదానీ వ్యవహరంలో ఇన్వెస్టర్లను రక్షించేందుకు, నియంత్రణ విధానాలను బలోపేతం చేసేందుకు ప్యానెల్ ఏర్పాటు పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్యానెల్‌కు సంబంధించిన సమాచారాన్ని సీల్డ్ కవర్‌లో తీసుకోవాలన్న కేంద్రం ప్రతిపాదనకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయంలో పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నట్లు తెలిపింది.
అంతకుముందు అదానీ గ్రూపుపై తప్పుడు ఆరోపణలను పరిశీలించేందుకు నిపుణులు, జడ్జితో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు సలహాలు ఇవ్వాలని కోర్టు కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్ల పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. కమిటీ ఏర్పాటుపై తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. కమిటీ ఏర్పాటు అంశం తామే చూసుకుంటామని తెలిపింది.
మరోవైపు నివేదికలోని ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. అయితే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల వివరాలు, అదానీ కంపనీల ఆడిట్ సమర్పించాలని ఓ పిటిషనర్ కోర్టును కోరారు. 'అదానీ గ్రూప్ ప్రమోటర్లు లేదా హిండెన్‌బర్గ్ నివేదికపై విచారణకు మేము అభ్యంతరం చెప్పడం లేదు. సెబీ, అన్ని నియంత్రణ సంస్థలు ఇప్పటివరకు తమ విధులను నిర్వర్తించాయని ప్రభుత్వ న్యాయవాది తుషార్ మెహతా చెప్పారు. కాగా, కమిటీ ఏర్పాటుపై ఆదేశాలు మరో రోజు ఆదేశాలు ఇవ్వనున్నట్లు సీజేఐ తెలిపారు.
Also Read...
ఆ పార్టీకి కఠిన పరిస్థితులు.. 2024 లోక్‌సభ ఎలక్షన్స్‌పై కాంగ్రెస్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలుs