Actor-politician Vijay: భద్రత కోసం ఎవరిని అడగాలి?.. డీఎంకేపై విజయ్ విమర్శలు

by Shamantha N |
Actor-politician Vijay: భద్రత కోసం ఎవరిని అడగాలి?.. డీఎంకేపై విజయ్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అన్నా యూనివర్సిటీలో(Anna University) జరిగిన లైంగికదాడిపై నటుడు, తమిళగ వెట్రి కజగం(TVK) చీఫ్ విజయ్ చేతితో రాసిన లేఖ వైరల్ గా మారింది. తమిళనాడు(Tamil Nadu)లో మహిళలకు భద్రత కల్పించాలని ఎవరిని అడగాలని అందులో ప్రశ్నించారు. “ ప్రజల భద్రత గురించి మేం ఎవరిని ప్రశ్నించాలి? మనల్ని పాలించే వాళ్లను ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదని తెలిసింది. అందుకే ఈ లేఖ’ అని టీవీకే అధినేత తన లేఖలో రాశారు. “తమిళనాడులోని విద్యాసంస్థలతో సహా ప్రతి రోజూ మహిళలనందరూ సామూహిక దౌర్జన్యాలకు, లైంగిక నేరాలకు గురవుతున్నారు. వారి సోదరుడిగా, ఆప్తుడిగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దారుణాలను చూసి వేదనకు గురవుతున్నాను. మహిళలందరికీ సోదరుడిలా అండగా ఉంటాను. అమ్మాయిలందరూ చదువుపై దృష్టి పెట్టండి. సురక్షితమైన రాష్ట్రాన్ని సృష్టిస్తాం. అందుకోసం అందరం కలిసి పనిచేద్దాం ”అని విజయ్ రాసుకొచ్చారు.

అన్నా యూనివర్సిటీలో లైంగికదాడి

డిసెంబరు 23న అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. దీంతో, తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. నిందితుడు జ్ఞానశేఖరన్ కు అధికార డీఎంకే పార్టీతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ, అన్నాడీఎంకే పేర్కొన్నాయి. అన్నాడీఎంకే నాయకులు నిరసనలు చేపట్టారు. బీజేపీ తమిళనాడు చీఫ్ కె అన్నామలే స్వీయదండన విధించుకున్నారు. డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ కొరడాలతో కొట్టుకున్నారు. ఇప్పుడు, ఈ ఘటనపైనే విజయ్ స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed