Aravind Kejriwal : అరవింద్‌ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ

by M.Rajitha |
Aravind Kejriwal : అరవింద్‌ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) పోలింగ్‌ ముగిసి, శనివారం ఫలితాలు వెలువడనున్నాయి. మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు రానుండగా.. ఢిల్లీ రాజకీయాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌(Exit Polls) అంచనా వేశాయి. అయితే, ఎన్నికల్లో తమదే అధికారమని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌(AAP Leader Aravind Kejriwal) స్పష్టం చేశారు. తమ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మంత్రి పదవులతో పాటు ఒక్కొక్కరికి రూ.15 కోట్ల వరకు డబ్బులు ఎరగా వేస్తుందని అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపడేయడమే కాకుండా.. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(Leftinent Governor)కు ఫిర్యాదు కూడా చేసింది. ఆప్‌ నాయకుల ఆరోపణలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని.. ఢిల్లీలో భయాందోళనలు, అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఎల్‌జీ వీకే సక్సేనా(LG VK Saksena) దర్యాప్తునకు ఆదేశించారు.

ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖను విచారణకు ఆదేశించిచారు. ఎల్‌జీ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకొని, ఆరోపణలకు గల ఆధారాలపై సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం (ఫిబ్రవరి 8న) వెలువడనున్న నేపథ్యంలో తమ పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆప్ అధినేత కేజ్రీవాల్‌ గురువారం ఆరోపించారు. ఆప్‌ అభ్యర్థులు పార్టీ మారితే మంత్రి పదవులతో పాటు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తామని బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చినట్లు ఆరోపించారు. ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌(Sanjay Singh)తో పాటు పలువురు నాయకులు సైతం ఆరోపణలు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో నిజనిజాలు బయటికి తీసుకురావాలని ఎల్జీ ఏసీబీకి ఆదేశాలు జారీ చేయగా.. నేడు కేజ్రీవాల్ ఇంట్లో ఆయనతో సమావేశం అయ్యి, ఆరోపణలకు గల సమాచారాన్ని సేకరించారు.

Next Story