ఆప్ సంచలన నిర్ణయం.. ఒంటరిగానే బరిలోకి!

by Geesa Chandu |
ఆప్ సంచలన నిర్ణయం.. ఒంటరిగానే బరిలోకి!
X

దిశ, వెబ్ డెస్క్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ఆప్(Aam Aadmi Party) పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆప్, కాంగ్రెస్ పార్టీ ల మధ్య పొత్తు కుదరక పోవడంతో ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒంటరిగానే ఆప్ పార్టీ బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికలలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఆప్ ఆశించిన స్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టలేకపోయింది.ఈ నేపథ్యంలోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. ఆప్ కు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి మొగ్గు చూపడం లేదు. కేవలం 5-6 సీట్లు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెగేసి చెప్పింది. అయితే కాంగ్రెస్ ను ఆప్ 10 సీట్లు కోరింది. ఎంతకూ ఈ పొత్తు కుదరకపోవడంతో.. ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా.. అక్టోబర్ 5 న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 8 న ఫలితాలు విడుదల చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed