- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AAP: అందుకే బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు.. ఆప్ నేత మనీష్ సిసోడియా

దిశ, వెబ్ డెస్క్: బీజేపీలో అందరూ అలాంటి నాయకులే ఉన్నారు కాబట్టే సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా(AAP Leader Maneesh Sisodia) అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో(Delhi Election Campaign) ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నాయకులు(BJP Leaders) ఆప్(AAP) కాదు.. ఆపద(AApda) అని సంభోదించారు. దీనిపై సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. మేము బీజేపీ(BJP)కి 'ఆపద' అని వారే స్పష్టంగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని బీజేపీలో ఉన్న నాయకులంతా అధికార దుర్వినియోగానికి పాల్పడటం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ప్రజలను దూషించడం, డబ్బు, చీరలు పంపిణీ చేయడం లాంటివి చేస్తారు కాబట్టి బీజేపీ ఢిల్లీలో సీఎం ముఖాన్ని(CM Candidate) ప్రకటించలేకపోయిందని విమర్శించారు. అంతేగాక అరవింద్ కేజ్రీవాల్‌కి ఎదురుతిరిగే వారిలో బీజేపీలో ఎవరు నమ్మదగినవారు అనే దానిపై పార్టీకి స్పష్టత లేదని, బీజేపీలో ఆ ఆపద కూడా ఉందని ఆరోపించారు. అయినా ఢిల్లీకి ఏం ఇస్తారో స్పష్టంగా చెప్పాలని, హర్యానా, యూపీలో బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా.. అక్కడి స్కూళ్లను బాగు చేశారా చెప్పాలని సిసోడియా ప్రశ్నించారు.