కేజ్రీవాల్‌‌కు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..రిలీజ్ చేయాలని ఆప్ నిరసన

by Vinod |
కేజ్రీవాల్‌‌కు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..రిలీజ్ చేయాలని ఆప్ నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో హాజరుపర్చగా మూడు రోజుల కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలోనే కస్టడీ ముగియడంతో శనివారం మరోసారి కోర్టులో హాజరుపర్చగా జూలై 12వరకు న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. విచారణలో భాగంగా కేజ్రీవాల్ సహకరించలేదని, తప్పించుకునే ప్రయత్నం చేశారని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాబట్టి కస్టడీని కొనసాగించాలని కోరారు. దీంతో సీబీఐ అభ్యర్థన మేరకు వెకేషన్ జడ్జి సునేనా శర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు, శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఢిల్లీ మంత్రులు, అతిషి, గోపాల్ రాయ్, దిలీప్ పాండే సహా ఆప్ అగ్రనేతలు ఆందోళనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణులను అనుసరిస్తోందని మండిపడ్డారు. కేజ్రీవాల్ జైలులోనే ఉండేలా కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని అందుకే ఈడీ, సీబీఐల మధ్య సమన్వయం చేస్తుందని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా గళం విప్పుతామని చెప్పారు.

Next Story

Most Viewed