రాహుల్ గాంధీకి నో సెన్స్.. MLA రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్

by Satheesh |
రాహుల్ గాంధీకి నో సెన్స్.. MLA రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ వెబ్‌డెస్క్: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సెన్స్ లేదంటూ, అందుకే ఆయన్ను అందరూ పప్పుు అని అంటుంటారని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్ సభలో సోమవారం రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్థరహితమైన వ్యాఖ్యలు చేసి, రాహుల్ గాంధీ తనకు సెన్స్ లేదని నిరూపించుకున్నారన్నారు. ఒక ప్రతిపక్ష నేత హోదాకు తగిన విధంగా మాట్లాడలేని రాహుల్ గాంధీ హిందువుల వల్లనే దేశం సురక్షితంగా ఉందన్ని విషయాన్ని తెల్సుకోవాలని సూచించారు. వెంటనే రాహుల్ గాంధీ హిందూవులందరికి క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. చట్ట సభల్లో రాహుల్ ఇలాగే మాట్లాడితే మీరు, మీ పార్టీ మునిగిపోవడమే కాదని, మీకు మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలు కనుమరుగైపోతాయని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed