కాంగ్రెస్ ఓటమిలో AAPదే ప్రధాన పాత్ర

by sudharani |   ( Updated:2022-12-11 11:51:41.0  )
కాంగ్రెస్ ఓటమిలో AAPదే ప్రధాన పాత్ర
X

గాంధీనగర్: గుజరాత్ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ సీఎం అశోక్ గెహ్లట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పేలవ ప్రదర్శనలో ఆప్ పెద్ద పాత్రను పోషించిందని అన్నారు. ప్రతి చోట అబద్దాలతో ఆప్ ముందుకు పోయిందని విమర్శించారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ తీవ్ర నష్టాన్ని చేశారని ఆరోపించారు. అయితే ప్రధాని చేపట్టిన ర్యాలీలు కూడా బీజేపీ ఘన విజయానికి కారణమని చెప్పారు.

మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో వెనుకబడిందని అంగీకరించారు. ఎలక్టోరల్ బాండ్స్ అతి పెద్ద స్కాంగా ఉన్నాయన్నారు. బీజేపీకి వీపరితమైన నిధులు సమకూరయని, అదే కాంగ్రెస్‌కు నిధులు సమాకూర్చేవారికి బెదిరింపులు ఎదురయ్యాయని ఆరోపించారు. మరోవైపు సచిన్ ఫైలట్ పై చేసిన గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర వివరణ ఇచ్చుకున్నారు. రాజకీయాల్లో ఇలాంటి సహజమని అన్నారు. కాలమే అన్నింటిని నిర్ణయిస్తుందని, ప్రతి కాంగ్రెస్ నేతకు బీజేపీతోనే పోటీ అని చెప్పారు.


Advertisement

Next Story

Most Viewed