ఆప్ కార్యాలయం విషయంలో కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

by Shamantha N |
ఆప్ కార్యాలయం విషయంలో కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి సంబంధించి కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించినట్లే ఆప్ కార్యాలయానికి స్థలం ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయంపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. పొలిటికల్ పార్టీలకు ఢిల్లీలో ఆఫీసులు ఏర్పాటు చేసుకునే అధికారం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. స్థలం అందుబాటులో లేదని చెప్పడాన్ని కారణంగా పరిగణించబోమని నొక్కి చెప్పింది.

ఆప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశం

అయితే, ఆప్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడంతో.. ఢిల్లీలో ఆఫీస్ ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కావాలని గతంలోనే కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం ఆప్ కార్యాలయం ఉన్న స్థలం ఢిల్లీ హైకోర్టుకు కేటాయించినట్లు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. జూన్ 15లోగా ఆఫీసు వెకేట్ చేయాలని ఆదేశించింది. దీంతో, కార్యాలయ ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించాలని ఆప్ హైకోర్టుని ఆశ్రయించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్క్ లోని మంత్రిత్వ శాఖల ప్రాంతంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని ఆప్ తరఫు న్యాయవాది హైకోర్టుని కోరారు.

Advertisement

Next Story