- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌కు ఆప్ ప్రపోజల్ ఇదీ..
దిశ, నేషనల్ బ్యూరో : ఇండియా కూటమిలోని ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకాలపై సోమవారం రోజే సంప్రదింపులు మొదలయ్యాయి. ఇరు పార్టీల ప్రతినిధుల మధ్య ఢిల్లీ వేదికగా జరిగిన ఒక క్లోజ్డ్ డోర్ సమావేశంలో ఏం చర్చించారనేది అధికారికంగా తెలియరాలేదు. ఢిల్లీలో 7, పంజాబ్‌లో 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ కూడా లేనందున.. అక్కడ ఆ పార్టీకి 3 లోక్‌సభ స్థానాలను ఇస్తామని ఆప్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తాము అధికారంలో ఉన్న మరో రాష్ట్రం పంజాబ్‌లోనూ కాంగ్రెస్‌కు 6 ఎంపీ సీట్లను ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సుముఖత వ్యక్తం చేసిందట. ఇదే విధంగా సీట్ల పంపకంతో తమకు గుజరాత్, హర్యానా, గోవా వంటి రాష్ట్రాల్లో సహకరించాలని కాంగ్రెస్‌ను ఆప్ కోరినట్లు సమాచారం. ఆప్ గుజరాత్‌లో 1, హర్యానాలో 3, గోవాలో 1 లోక్‌సభ సీటును కాంగ్రెస్ నుంచి కోరిందని అంటున్నారు.