- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా వాళ్లు జైలుకెళ్లేందుకు భయపడరు: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర సంస్థలను కాషాయ పార్టీ దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. అయితే తమ పార్టీ నేతలు జైలుకెళ్లేందుకు భయపడరని అన్నారు. ‘సమస్యలను లేవనెత్తగల సామర్థ్యం మాకు ఉంది. మేము ఒంటరిగా లేము. ఈ దేశ పౌరులందరూ మాతో ఉన్నారు. కేంద్ర సంస్థల దుర్వినియోగాన్ని శాంతియుతంగా ఎత్తిచూపుతాం’ అని అన్నారు. ఈ సమస్య కేవలం ఒక వ్యక్తికో పార్టీకో పరిమితం కాలేదని దుయ్యబట్టారు. సంజయ్ రౌత్, తేజస్వీ యాదవ్, కల్వకుంట కవిత, మనీష్ సిసోడియా అందరూ కేంద్రం సూచనలతోనే దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొన్నారని ఆరోపించారు. వీరే కనుక బీజేపీలో చేరి ఉంటే దర్యాప్తు ఆగిపోతుందని అన్నారు. దేశంలో అనేక మంది నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, బీజేపీలో చేరగానే పోతున్నాయని చెప్పారు. జైలుకు వెళ్తారని బెదిరింపులకు గురిచేస్తూ పార్టీలోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు. అయితే తాము జైలుకు వెళ్లేందుకు బెదరమని, ఉద్యమం నుంచి తమ పార్టీ వచ్చిందని తెలిపారు.