కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిర‌స‌న‌గా జంతర్ మంతర్ వద్ద ఆప్ నేత‌ల సామూహిక నిరాహార‌దీక్ష‌

by S Gopi |
కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిర‌స‌న‌గా జంతర్ మంతర్ వద్ద ఆప్ నేత‌ల సామూహిక నిరాహార‌దీక్ష‌
X

దిశ, నేషనల్ బ్యూరో: మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నేతలు ఆదివారం సాముహిక నిరాహార దీఖణు చేపట్టారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షలో పార్టీ నేతలతో పాటు భారీ సంఖ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సాముహిక నిరాహార దీక్షకు మద్దతుగా భారత్‌తో పాటు విదేశాల్లో ఉన్న పార్టీ మద్దతుదారులు ఆయా ప్రాంతాల్లోని రాయబార కార్యాలయాల ఎదుట సమావేశంలో పాల్గొన్నారని ఆప్ నేత గోపాల్ రాయ్ అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే బీజేపీ ఈ సమయంలో అరెస్ట్ చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మద్దతిచ్చే అందరూ ఈ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వాల్లోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూలదోసే బీజేపీ లాంటి వారితో పోరాడే సమయం వచ్చింది. తాము భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని పేర్కొన్నారు. బీజేపీ పాలకులు ఆప్‌ను చీల్చాలని ప్రయత్నించే కొద్దీ తాము మరింత బలపడతాము. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు అరవింగ్ కేజ్రివాల్‌కు అండంగా నిలుస్తున్నారని ఆప్ నేతలు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed