- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌కు ఆప్ ఊహించని షాక్!
దిశ, డైనమిక్ బ్యూరో: పంజాబ్‌లోని జలంధర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆప్ అభ్యర్థి సుశీల్ రింకూ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కరమ్ జీత్ కౌర్ పై 5,5140 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సుశీల్ కుమార్‌కు ఇప్పటి వరకు 2,85,773 ఓట్లు పోల్ అవ్వగా కరమ్ జీత్ కౌర్ కు 2,29,523 ఓట్లు వచ్చాయి. శిరోమణి అకాలీ దల్ అభ్యర్థి మూడో స్థానంలో ఉండగా బీజేపీ అభ్యర్థి నాలుగో స్థానంలో ఉన్నారు.
కాగా జలంధర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి ఈ ఏడాది జనవరిలో భారత్ జోడో యాత్రలో గుండెపోటుతో మరణించారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. పోటీలో సంతోక్ సింగ్ చౌదరి భార్య కరమ్ జీత్ కౌర్ కే కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా కాంగ్రెస్ ను వీడి ఆప్‌లో చేరిన సుశీల్ రింకూను కేజ్రీవాల్ తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. సానుభూతి ఓట్లతో ఈ సీటు ఎలాగైనా తమ ఖాతాలోకే వస్తుందని కాంగ్రెస్ భావిచినప్పటికీ పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ హస్తం నేతల ఆశలకు గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read...
కర్ణాటక రిజల్ట్స్ : ఇప్పటి వరకు ఆయా పార్టీలకు పోలైన ఓట్ల శాతం ఇదే..!