- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యువతి కోసం తండ్రి, కొడుకు త్యాగం.. ఇద్దరూ అలా పెళ్లి చేసుకొని..
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్యకాలంలో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. అలా జరిగిన ఓ వివాహంలో కన్నకొడుకు పెళ్లి కోసం, కన్న తండ్రి కూడా తన మతాన్ని మార్చుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా కరేలిలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే జిల్లాలోని చిచ్లీ అనే గ్రామానికి చెందిన ఫాజిల్ (23) అనే యువకుడు అమ్ గామ్ కు చెందిన సోనాలీతో ప్రేమలో పడ్డాడు. ఇద్ధరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అందుకోసం కలెక్టర్ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే యువతి హిందూ, యువకుడు ముస్లిం మతానికి చెందిన వారు కావడంతో మత పెద్దలు వారి వివాహానికి నిరాకరించారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ బయటపడింది. అది ఏంటంటే యువకుని తండ్రి పుట్టుకతోనే హిందూ మతానికి చెందిన వాడని, అతను కూడా తాను ప్రేమించిన యువతిని పెళ్లాడేందుకు మతం మార్చుకున్నాడని తెలిసింది. ప్రస్తుతం యువకుడు ఫాజిల్ కూడా తన మతాన్ని మార్చుకుంటానని తెలపడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించారు. ఇంకేముంది వారి ప్రేమ కథ సుఖాంతం అయ్యింది.