- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
భర్తకు విడాకులిచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్న మహిళ
దిశ, వెబ్ డెస్క్: స్వలింగ సంపర్కుల వివాహం దేశంలో తీవ్ర చర్చనీయాంశ మవుతున్నాయి. ఇటీవల స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశం సుప్రీం కోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడక ముందే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్న ఘటన హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మౌసుమి దత్తా, మౌమిత అనే ఇద్దరు మహిళలు గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే మౌసుమి అనే మహిళకు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో మౌసుమి పిల్లలను తన పిల్లలుగా స్వీకరించేందుకు మౌమిత అంగీకరించింది. ఈ క్రమంలో మౌసుమి తన భర్తకు విడాకులిచ్చి చింఘిఘాట్‌లోని బగ్దర్‌లోని భూతనాథ్ ఆలయంలో ఆదివారం (మే 28) మౌమితను వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా మౌమిత మాట్లాడుతూ.. ‘ప్రేమ అనేది స్త్రీ పురుషుల మధ్య మాత్రమేనా? ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషుల మధ్యలో కూడా ప్రేమ చిగురిస్తుందని, వారు కలిసి ఉండగలరు. మౌసుమిని వివాహం చేసుకోవడం మా కుటుంబానికి ఇష్టం లేకపోవడంతో మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు. జీవితాంతం తనతో కలిసే ఉంటానని ప్రమాణం చేశాను. మౌసుమిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోనని ప్రమాణం చేశాను. అందుకే నా ప్రియురాలితో కలిసి అద్దె ఇంట్లో కాపురం పెట్టానని’ మౌమిత తెల్పింది. సంప్రదాయాన్ని ఉల్లంఘించి పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.