రన్నింగ్ బస్సులో మహిళకు పురిటి నొప్పులు.. బస్సునే ఐసీయూగా మార్చేసిన వైద్యులు

by Prasad Jukanti |
రన్నింగ్ బస్సులో మహిళకు పురిటి నొప్పులు.. బస్సునే ఐసీయూగా మార్చేసిన వైద్యులు
X

దిశ, డైనమిక్ బ్యూరో:సహాయం చేయాలనే మనసు ఉంటే తోచినంతలో ఏదో ఓ రూపంలో సాయపడవచ్చుని తాజాగా కేరళలో ఓ ఆర్టీసీ బస్సు సిబ్బంది, ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిరూపించారు. దీంతో ఓ మహిళ బస్సులోనే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన 37 ఏళ్ల సెరీనా తొమ్మిది నెలల గర్భవతి. బుధవారం ఆమె అంగమలై నుంచి తొట్టిల్‌పాలెంకు బస్సులో ప్రయాణిస్తోంది.. బస్సు పెరమంగళం పోలీస్ స్టేషన్‌కు చేరుకోగానే ఆమెకు పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును త్రిసూర్ లోని అమల ఆసుపత్రికి బస్సును మళ్లించాడు. అయితే అప్పటికే ప్రసవం ప్రారంభం కావడంతో సదరు మహిళను ఆసుపత్రి లోపలికి తరలించడం వీలు పడలేదు. దీంతో విషయం తెలుసుకున్న వైద్యులు బస్సునే ఐసీయూగా మార్చేశారు. బస్సులోకే వైద్యులు వెళ్లి మహిళకు ప్రసవం చేశారు. అనంతరం తల్లి బిడ్డలను ఆసుపత్రిలోకి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు హీరోస్ ఆన్ ది రోడ్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళ ప్రసవంలో సహయపడిన వారందరికీ ధన్యవాదాలు.. కొత్త బేబీకి స్వాగతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది అసలైన కేరళ రియల్ స్టోరీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed