‘ఫ్రెండ్లీ’ పోలీస్..! సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు

by Ramesh N |   ( Updated:2024-03-02 16:51:52.0  )
‘ఫ్రెండ్లీ’ పోలీస్..! సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ హెడ్ కానిస్టేబుల్ తప్పతాగి హైవే పక్కనే ఉన్న తోడుపు బండిపై మంచిగా గురకపెట్టి నిద్రపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లా జబల్‌పూర్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ తప్పతాగి రోడ్డు పక్కన తోపుడు బండిపై తన స్నేహితుడితో కలిసి పడుకున్నాడు.

ఒంటిపై యూనిఫాం గమనించిన స్థానిక వ్యక్తులు వీడియో తీసి పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందిచారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి హెడ్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్‌లో ఫ్రెండ్లీ పోలిసింగ్ బాగుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story