భారత్‌పై బిల్‌గేట్స్ ప్రశంసలు.. ఏమన్నారంటే..

by Hajipasha |
భారత్‌పై బిల్‌గేట్స్ ప్రశంసలు.. ఏమన్నారంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : భారతదేశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసల జల్లు కురిపించారు. భారత ప్రభుత్వం, భారతీయ ప్రైవేట్ రంగం, బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కలిసికట్టుగా తక్కువ ఖర్చుతో కూడిన సికిల్ సెల్ ఎనీమియా చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సమస్యలకు విలువైన పరిష్కారాలను చూపిస్తున్న భారతదేశాన్ని ప్రపంచ ఆవిష్కర్తగా బిల్‌గేట్స్ కొనియాడారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సికిల్ సెల్ ఎనీమియా చికిత్స ఖర్చులను అధిక ఆదాయం కలిగిన అమెరికా వంటి దేశాల ప్రజలు కూడా భరించలేకపోతున్నారని బిల్ గేట్స్ చెప్పారు. ఈ తరుణంలో చికిత్స ఖర్చులను తగ్గించే ఆవిష్కరణ రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారతదేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లు 150 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా అయ్యాయని ఆయన గుర్తు చేశారు. కరోనా సంక్షోభ కాలంలో భారత్‌లోని వ్యాక్సిన్ తయారీ కంపెనీలతోనూ బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ జట్టు కట్టిందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed