- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉత్తరాఖండ్‌లో కూలిన టన్నెల్ నిర్మాణ సంస్థ బీజేపీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలుసా..!
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఏ ఏ పార్టీకి ఎన్ని నిధులు వచ్చాయో వాటి తాలుకూ డేటాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో కొద్ది నెలల క్రితం ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన టన్నెల్‌ను నిర్మించిన హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (NEC) బీజేపీకి రూ.55 కోట్ల విరాళాన్ని ఇచ్చింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ మొత్తానికి విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను నవయుగ కంపెనీ కొనుగోలు చేసింది. NEC ఏప్రిల్ 19, 2019- అక్టోబర్ 10, 2022 మధ్య ఒక్కొక్కటి రూ. 1 కోటి చొప్పున 55 ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసినట్లుగా డేటా చూపించింది. గత ఏడాది నవంబర్ 12, 2023న నిర్మాణంలో ఉన్న సిల్క్యారా-బార్కోట్ సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో మొత్తం 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. దీంతో రక్షణ చర్యలు మొదలుపెట్టి కొత్త టెక్నాలజీల సహాయంతో నవంబర్ 28న కార్మికులను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు.