- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశ రాజధాని ఢిల్లీలో విచిత్ర వాతావరణం.. రికార్డ్ స్థాయిలో ఎండ.. కాసేపటికే వర్షం..!
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో ఉష్ణోగ్రత 52.3 డిగ్రీలు నమోదు అయ్యింది. ఇది ఇప్పటి వరకు ఢిల్లీ చరిత్రలోనే రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత. రాజధాని హిస్టరీలోనే రికార్డ్ స్థాయి టెంపరేచర్ నమోదు కావడంతో ఢిల్లీ వాసులు కాలు బయటపెట్టాలంటే గజగజ వణికిపోయారు. అయితే, మధ్నాహం వరకు భానుడి ప్రతాపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని వాసులకు సాయంత్రానికి విచిత్ర వాతావరణం ఎదురైంది. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టగా సాయంత్రానికి ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతతో వేడెక్కిన రాజధాని.. సాయంత్రానికి వర్షం కూల్ అయ్యింది. ఒకే రోజు ఢిల్లీలో హిస్టరీలోనే అత్యధిక ఉష్ణోగ్రతను చూసిన రాజధాని వాసులు.. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా కూల్ అయ్యి వర్షం పడటం చూసి అవాక్క్ అయ్యారు. ఈ విచిత్ర వాతావరణం పట్ల రాజధాని వాసులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. రోజురోజుకీ దేశ రాజధానిలో పెరిగిపోతున్న కాలుష్యమే ఈ విచిత్ర వాతావరణ మార్పులకు కారణమని అనుకుంటున్నారు.