- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక నుంచి పని మనుషులు పార్కుల్లో కూర్చోవద్దు.. ఓ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్క్యులర్
దిశ, వెబ్ డెస్క్: తమ ఇళ్లల్లో పని చేసే వర్కర్లు తమ కాంప్లెక్స్ లోని పార్క్, మైదానం వంటి వాటిని ఉపయోగించరాదని బెంగళూరులోని ఓ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్క్యులర్ జారీ చేసింది. పని కోసం షిఫ్ట్ చేంజ్ అయ్యేటప్పుడు కావాలంటే వాళ్లు వెయిటింగ్ స్థలాలను ఉపయోగించుకోవాలని తెలిపింది. ఎక్కడ పడితే అక్కడ పని మనుషులు తిరగడం వల్ల రెసిడెంట్లకు ఇబ్బందిగా మారిందని, పైగా మానిటరింగ్ చేయాలంటే సెక్యూరిటీకి కూడా కష్టంగా ఉందని పేర్కొంది. కాంప్లెక్స్ భవన్ లోని రిసెప్షన్ లోని సోఫాలో వంట మనుషులు, కార్పెంటర్లు, ప్లంబర్లు వంటి వాళ్లు కూర్చోవడం వల్ల రెసిడెంట్లకు కూర్చోవడానికి ప్లేస్ లేకుండా పోయిందని, వాళ్ల పక్కను కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉందని సర్క్యులర్ లో అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. దీంతో రెసిడెంట్లు అక్కడ కూర్చోవడమే మానేశారని వారు అన్నారు.
కాగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ జారీ చేసిన ఈ సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలు విమర్శలు వస్తున్నాయి. పలు విధాలుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘‘మీ ఇంట్లో తిరిగేటప్పుడు, మీకు వండిపెట్టేటప్పుడు, మీ ఇళ్లను శుభ్రం చేసేటప్పుడు లేని సమస్య వాళ్లు పార్కుల్లో, సోఫాలో కూర్చుంటే వచ్చిందా ?’’ అని ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు. ‘‘ ఆ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు చెప్పండి. అటు పోకుండా ఉంటాను’’ అంటూ మరో వ్యక్తి అన్నారు. మీరు అనుకున్నట్లు కావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది.. అప్పటి దాకా వెయిట్ చేయండి. అంతేగానీ ఇలా పని మనుషులను వివక్షతతో చూడకండి’’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.