‘ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్’ ఇస్తున్న రైల్వే మంత్రికి థాంక్యూ.. వందే భారత్‌‌ ఫుడ్‌పై సెటైర్లు

by Ramesh N |   ( Updated:2024-02-20 13:42:30.0  )
‘ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్’ ఇస్తున్న రైల్వే మంత్రికి థాంక్యూ.. వందే భారత్‌‌ ఫుడ్‌పై సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో సరఫరా చేస్తున్న ఆహారం సరైన ప్రమాణాలతో లేదని పదే పదే ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడయా వేదికగా ఎన్నో సార్లు ప్రయాణికులు ఐఆర్‌సీటీసీకి కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు. ఐఆర్‌సీటీసీ కూడా ఎన్నో సార్లు స్పందించి వారికి కలిగిన ఆసౌకర్యానికి చింతించి చర్యలు తీసుకుంటామని వెల్లడించేది. అయినా కూడా నేటికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహారం విషయంలో నాణ్యత పాటించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఓ నెటిజన్ ఇటీవల వందే భారత్ ట్రైన్‌లో ప్రయాణించారు. ఈ క్రమంలోనే ఆయన ఆర్డర్ ఇచ్చిన ‘చోలే’ కర్రీ నాసిరకంగా ఉన్నది. దీంతో ఆయన అసహనానికి గురై ట్విట్టర్ వేదికగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రయాణికుడు సెటైరికల్‌గా థాంక్యూ చెప్పారు.

‘థాంక్యూ అశ్విని వైష్ణవ్ జీ, వందే భారత్‌లో హెల్దీ ఫుడ్ఇస్తున్నందుకు.. ‘చోలే’ కర్రీలో ఆయిల్, మిర్చి మసాలా ఏమీ లేవని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు రైల్వే పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. చోలే కర్రీ నా.. లేక చోలే సూప్ హా.. అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story