పోలింగ్ కేంద్రమా? కళ్యాణ మండపమా?.. ఆశ్చర్యపోతున్న ఓటర్లు

by Ramesh Goud |   ( Updated:2024-06-01 08:17:46.0  )
పోలింగ్ కేంద్రమా? కళ్యాణ మండపమా?..  ఆశ్చర్యపోతున్న ఓటర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ లో భాగంగా పంజాబ్ లో సూపర్ మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఏడవ దశ పోలింగ్ లో భాగంగా 8 రాష్ట్రాలు, యూటీల్లో మొత్తం 57 పార్లమెంట్ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఓటింగ్ సక్రమంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపధ్యంలోనే అమృత్ సర్ లో ఏర్పాటు చేసిన సూపర్ మోడల్ పోలింగ్ స్టేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోలింగ్ స్టేషన్ లోని అధికారులు ఓటర్లను బ్యాండ్ బాజాలతో స్వాగతం పలుకుతున్నారు. పోలింగ్ బూత్ ముందు అందంగా అలంకరించి రెడ్ కార్పెట్ వేసి మరి ఆహ్వానాలు పలుకుతున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లకు ఆకర్షించేందుకు బ్యాండ్ బాజాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారుజ. పోలింగ్ స్టేషన్ వద్ద ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు ఈ ఏర్పాట్లు చూసి, పోలింగ్ స్టేషన్ కు వచ్చామా లేక పెళ్లి మండపానికి వచ్చామా అని ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు సూపర్ మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడంపై ఎన్నికల అధికారులపై ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story