- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదేండ్ల బాలుడికి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం.. ఎక్కడంటే?
దిశ, వెబ్‌డెస్క్: చత్తీస్‌గఢ్ సుర్గుజాలో నమన్ రాజ్‌పడే అనే ఓ ఐదేళ్ల బాటుడిని పోలీసులు ‘చైల్డ్ కానిస్టేబుల్’ గా నియమించారు.ఈ ఐదేళ్ల చిన్నారిని కానిస్టేబుల్ పోస్టులో నియమించడం ఏమిటి? అనే ప్రశ్న చాలా మందిలో మొదలయ్యింది. అయితే కానిస్టేబులైన ఆ బాలుడి తండ్రి రాజ్ కుమార్ రాజ్వాడే ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ కానిస్టేబుల్ భార్య, 5 ఏళ్ల కుమారుడు నమన్‌లు రాజ్ కుమార్‌పై ఆధారపడి జీవించేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖ ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. జీతభత్యాలు, సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు రాజ్ కుమార్ కుమారుడు నమన్‌ను కారుణ్య నియామకం కింద చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమించారు. బాలుడికి 18 ఏళ్లు నిండగానే పూర్తిస్థాయి కానిస్టేబుల్ బాధ్యతలు అప్పగిస్తామని, అప్పటివరకు అతని తండ్రి రాజ్ కుమార్ రాజ్వాడే జీతంలోని సగం భృతి వారికి అందుతుందని సుర్గుజా ఎస్పీ భావనా గుప్తా తెలిపారు. నియామక పత్రాన్ని నమన్‌కు అందజేశారు. ఆ చిన్నారికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఇప్పుడు మీరు కూడా పోలీస్ అయ్యారని చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.