Wearing Earphones : కానిస్టేబుల్ ప్రాణం తీసిన ఇయర్ ఫోన్.. నిషాదంగా మారిన చిన్న మిస్టెక్

by Prasad Jukanti |
Wearing Earphones : కానిస్టేబుల్ ప్రాణం తీసిన ఇయర్ ఫోన్.. నిషాదంగా మారిన చిన్న మిస్టెక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వయంకృతాపరాధం వల్ల ఓ కానిస్టేబుల్ నిండు ప్రాణం పోయింది. ఇయర్ ఫోన్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతుండగా ట్రైన్ ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. యూపీలోని షాజహాన్ పూర్ లో బుధవారం ఈ ఘటన జరిగింది. షామ్లీ జిల్లాకు చెందిన అక్షయ్‌వీర్‌ అనే ఓ కానిస్టేబుల్ మరో ఇద్దరితో పాటు ఇందిరా నగర్ రైల్వే క్రాసింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రాక్ దాటుతుండగా ఓ వైపు నుంచి ట్రైన్ వేగంగా దూసుకువచ్చింది. ఈ ఘటనలో లో అక్షయ్ వీర్ ను రైతుల ఢీకొట్టడంతో ఒక కాలు తెగిపడిపోయింది. ఆసుపత్రికి తరలించినప్పటికీ అధిక రక్తస్రావం కారణంగా అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఘటన సమయంలో మృతుడు ఇయర్ ఫోన్ లు పెట్టుకున్నట్లు అనుమానిస్తున్నారు. దానివల్లే అతడు రైలు వస్తున్నట్లుగా గమనించలేకపోయారని, ట్రైన్ శబ్ధాన్ని వినలేకపయారని పోలీసుల అనుమానిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. కాగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాడుతూ ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ నేఫథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డ్రైవింగ్ తో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో సెల్ ఫోన్లు, ఇయర్ ఫోన్లు ఉపయోగించకపోవడం మంచిది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed