Nara Lokesh: ఇది ఏపీకి కొత్త సూర్యోదయం.. బడ్జెట్‌పై నారా లోకేష్ రియాక్షన్

by Hajipasha |   ( Updated:2024-07-23 17:56:51.0  )
Nara Lokesh: ఇది ఏపీకి కొత్త సూర్యోదయం.. బడ్జెట్‌పై నారా లోకేష్ రియాక్షన్
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ అగ్రనేత, ఏపీ మంత్రి నారా లోకేష్, రైతు నాయకుడు రాకేష్ టికాయత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందన ఇలా..

నారా లోకేష్ ఏమన్నారంటే..

‘‘ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రకటనలతో ఆంధ్రప్రదేశ్‌ కొత్త సూర్యోదయాన్ని చూసింది. కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలకు నేను చాలా సంతోషిస్తున్నాను. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏపీ అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఈప్రకటనలు సహాయపడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర రాజధాని ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం గొప్ప విషయం. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణం. పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, హెచ్‌ఆర్‌డీ వంటి ముఖ్య రంగాలను కవర్ చేస్తూ ప్రత్యేక, సమగ్ర ప్యాకేజీని రాష్ట్రానికి కేంద్రం అందిస్తుంది. అమరావతి, పోలవరానికి కేంద్ర సర్కారు ఉదారంగా ​​సహకారాన్ని అందించబోతోంది. కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఈ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెడ్ లెటర్ డే లాంటిది. కలల ఏపీ రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి ఇదితొలి అడుగు’’ అని ఏపీ మంత్రి, టీడీపీ అగ్రనేత నారా లోకేష్ పేర్కొన్నారు.

సంపన్న, సమానత్వ భారత్‌కు బాటలు : బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

‘‘సమానత్వంతో విరాజిల్లుతూ సంపన్నంగా వెలుగొందే భారతదేశ నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా ఈ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ విధానాలు వృద్ధిని వేగవంతం చేసేలా, ఉద్యోగాలను సృష్టించేలా, పౌరుల జీవన నాణ్యతను పెంచేలా ఉన్నాయి. గ్రామాలు, పేదలు, మహిళలు, యువత, దళితులు, ఆదివాసీలకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసింది. దేశ ఆర్థిక స్థిరత్వమే దీని విజన్’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

రైతులకు ఒరిగేదేం లేదు : రైతు నాయకుడు రాకేష్ టికాయత్

‘‘ఈ బడ్జెట్ వల్ల రైతులకు ఒరిగేదేం ఉండదు. రైతులకు సేంద్రీయ వ్యవసాయాన్ని నేర్పించే కంపెనీలకే తప్ప.. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ప్రయోజనం కలగదు. రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్, నీరు అందించాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. తక్కువ ధరకే ఎరువులు అందించాలి. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని తగ్గించాలి’’ అని ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ టికాయత్ పేర్కొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story