లీటర్‌ పెట్రోల్‌ రూ.200.. వంటనూనె రూ.250

by Shiva |   ( Updated:2023-06-05 05:52:13.0  )
లీటర్‌ పెట్రోల్‌ రూ.200.. వంటనూనె రూ.250
X

దిశ, వెబ్ డెస్క్ : మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణను కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంఫాల్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో రూ.200 వరకు అమ్ముతున్నారు. వంట నూనె లీటర్‌ ధర రూ.250 నుంచి 280 వరకు పలుకుతోంది. బియ్యం, టమాటా, ఆలుగడ్డ మొదలైన నిత్యవసర, కూరగాయల ధరలు ధరలు రూ.30 నుంచి రూ.40 వరకు పెంచటంతో సామాన్యులు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: లెక్క తప్పుతోన్న ఇంటి ‘బడ్జెట్’.. ఒక్కో కుటుంబంపై నెలకు రూ.1500 నుంచి రూ.2000 వరకు భారం!

Advertisement

Next Story