- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల’పై మార్గదర్శకాలు.. రీఛార్జ్ ఎలాగో తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : విద్యుత్ పంపిణీ రంగంలో కీలక సంస్కరణ దిశగా మరో ముందడుగు పడింది. ప్రీపెయిడ్ కన్స్యూమర్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు, నిర్వహణలో డిస్కంలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర విద్యుత్ శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలకు కేంద్రం పంపింది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్) అమలులో భాగంగా దేశవ్యాప్తంగా 19.79 కోట్ల ప్రీపెయిడ్ కన్స్యూమర్ మీటర్లు, 52.19 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 1.88 లక్షల ఫీడర్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపామని విద్యుత్ శాఖ వెల్లడించింది. దేశంలోని దాదాపు 9 కోట్ల మంది వినియోగదారులకు ఈ స్కీంలో భాగంగా ప్రీపెయిడ్ కన్స్యూమర్ విద్యుత్ మీటర్లు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ మీటర్లను అమర్చాక.. ప్రీపెయిడ్ మోడ్‌లో విద్యుత్ సరఫరా సేవలు కంటిన్యూ అవుతాయని స్పష్టం చేసింది. దీనిపై డిస్కంలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. ప్రీపెయిడ్ మీటర్ల పనితీరు, బ్యాలెన్స్, అలర్ట్స్, రీఛార్జ్, లోడ్ వంటి వివరాలన్నీ వినియోగదారులకు తెలియజేసేలా ప్రత్యేక మొబైల్ యాప్, వెబ్‌సైట్లను అందుబాటులోకి తేవాలని డిస్కంలకు కేంద్ర విద్యుత్ శాఖ నిర్దేశించింది. ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చాక వినియోగదారులకు రూ.300 వరకు ఎమర్జెన్సీ క్రెడిట్‌గా అందించాలని.. ఆ మొత్తాన్ని వాడుకునేలోగా రీఛార్జ్ చేసుకోకుంటేనే విద్యుత్ సప్లై ఆపేయాలని సూచించింది. విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేయడానికి ముందు యూజర్‌ను కనీసం మూడుసార్లు అలర్ట్ మెసేజ్‌లను పంపాలని డిస్కంలకు విద్యుత్ శాఖ తెలిపింది. బ్యాలెన్స్ రూ.50కి చేరినప్పుడు ఒకసారి, బ్యాలెన్స్ సున్నాకు చేరినప్పుడు రెండోసారి, బ్యాలెన్స్ మైనస్ రూ.200కు చేరినప్పుడు మూడోసారి అలర్ట్ చేయాలని పేర్కొంది. కన్స్యూమర్ రీఛార్జ్ చేసుకున్న 15 నిమిషాల్లోగా ఆ అమౌంట్ వినియోగదారుడి అకౌంట్లో కనిపించాలని నిర్దేశించింది. కరెంటు కనెక్షన్ కట్ అయ్యాక రీఛార్జ్ చేసుకున్నా.. 15 నిమిషాల్లోగా విద్యుత్ సప్లై తిరిగి మొదలయ్యేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపింది.