- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జవాన్లే లక్ష్యంగా మావోయిస్టుల ఎటాక్.. మందుపాతర పేలి జవాన్ మృతి
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ జవాన్ మరణించాడు. ఈ సంఘటన బస్తర్ లోని నారాయణపూర్ జిల్లా ఓరచ్ ప్రాంతంలో జరిగింది. సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన పోలీస్ బృందం కూంబింగ్ చేస్తుండగా ఈ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో సంజయ్ లక్డా అనే జవాన్ చనిపోయాడు. దీనికి ఒక రోజు ముందే మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు డీఆర్‌ఓ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.
పోలీస్ క్యాంపుగా మార్చారు..
ఇదిలా ఉండగా.. పోలీసులు బస్తర్ మొత్తాన్ని పోలీస్ క్యాంపుగా మార్చారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. బస్తర్ దక్షిణ డివిజనల్ కమిటీ ప్రతినిధి గంగా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. గత నాలుగు నెలల్లోనే 9 పోలీస్ క్యాంపులను ప్రారంభించిన ప్రభుత్వం యుద్ధ వాతావరణం సృష్టించింది అని పేర్కొన్నారు. అత్యాధునిక హెలీకాప్టర్లు, డ్రోన్ విమానాలతో దాడులు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కోసం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు వెళుతున్న కూలీలను మావోయిస్టుల పేర అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు.