గోల్డ్ షాప్‌లోకి పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన రూ.2 కోట్ల ఆభరణాలు

by Mahesh |
గోల్డ్ షాప్‌లోకి పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన రూ.2 కోట్ల ఆభరణాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వరదలు నగల వ్యాపారిని నిండా ముంచాయి. నగల షాప్ లోకి వరద నీరు పోటెత్తడంతో రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు కొట్టుకుపోయాయి. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మల్లీశ్వర్ ప్రాంతంలోని నిహాన్ జ్యువెల్లరీ అనే నగల దుకాణంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో షాపులో నగలు వరద పాలయ్యాయి. వీటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని నిహాన్ జ్యువెల్లరీ యజమాని ప్రియా కన్నీటి పర్యంతమయ్యారు.

వరదల్లో చిక్కుకుపోయిన తమ షాప్ ను కాపాడేందుకు సాయం కోసం మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసినా వారు స్పందించలేదని, వరదల కారణంగా షాప్ లో ఉన్న 80 శాతం నగలు కొట్టుకుపోయాయని చెప్పారు. మరోవైపు భారీ వర్షాలతో బెంగళూరు నగరం చివురుటాకులా వణికిపోతోంది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు గుంతల మయంగా మారాయి. సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందుల పాలైంది.

Advertisement

Next Story

Most Viewed