నీటి కోసం ఏనుగు ఆక్రందన! అటవీ ప్రాంతంలో హృదయ విదారక ఘటన

by Ramesh N |
నీటి కోసం ఏనుగు ఆక్రందన! అటవీ ప్రాంతంలో హృదయ విదారక ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: వేసవి కారణంగా అడవుల్లో జంతువులకు నీరు దొరకడం లేదని ఈ ఒక్క సంఘటనతో రుజువైంది. ఓ ఏనుగు నీటి కోసం వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. తమిళనాడులోని సత్యమంగళం అటవీ ప్రాంతంలో తీవ్రమైన నీటి కరువు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలోనే సంచరించే ఓ ఆడ ఏనుగు నీటి కోసం తిరుగుతూ ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కడంబుర్ కొండల సమీపంలోని పళనిసామి ఆలయం వద్దకు నీటి కోసం వెళ్లి గోతిలో పడింది. దీంతో గోతిలో పడటంతో ఏనుగు కొట్టుమిట్టాడుతోంది.

ఏనుగును రక్షించేందుకు అటవీశాఖ కసరత్తు చేస్తోంది. అటవీశాఖ పశువైద్యాధికారి సదాశివం నేతృత్వంలోని వైద్య బృందం ఏనుగుకు చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎండాకాలం అడవుల్లో జంతువులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు త్వరగా కోలుకునేలా చేయాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed