దత్తత తీసుకున్న నాలుగేళ్ల చిన్నారికి చిత్రహింసలు.. డాక్టర్ దంపతుల అరెస్ట్

by Sathputhe Rajesh |
దత్తత తీసుకున్న నాలుగేళ్ల చిన్నారికి చిత్రహింసలు.. డాక్టర్ దంపతుల అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దత్తత తీసుకున్న నాలుగేళ్ల చిన్నారిని చిత్రహింసలకు గురి చేస్తున్న వైద్య దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైక్రియార్టిస్ట్ సంగీత దత్తా, గ్యాస్ట్రో ఇంటెన్షనల్ జనరల్ సర్జన్ వాలియుల్ ఇస్లాం దంపతులు. అయితే నాలుగేళ్ల చిన్నారిని వేడిగా ఉన్న ఇనుప రాడ్ తో కొడుతుండగా కొంత మంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని కాపాడారు. దంపతులు మొదట చిన్నారి తమ కూతురే అని చెప్పినా విచారణలో దత్తత తీసుకున్నట్లు తెలిసింది. చిన్నారి ఒంటిపై కాలిన గాయాలు ఉన్నాయని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ నందిని తెలిపారు. చిన్నారి సైతం తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నట్లు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story