తల్లి ఎలుగు దెబ్బకు తోక ముడిచిన పెద్ద పులి

by Y. Venkata Narasimha Reddy |
తల్లి ఎలుగు దెబ్బకు తోక ముడిచిన పెద్ద పులి
X

దిశ, వెబ్ డెస్క్ : సృష్టిలో మనుషులు.. వన్యప్రాణులు..పశుపక్ష్యాదులు సహా తన పిల్లల సంరక్షణకు ప్రమాదం ఎదురైనప్పుడు ఎంతటి రిస్కునైనా తీసుకోవడం చూస్తుంటాం. ఇందుకు నిదర్శనమన్నట్లుగా ఓ ఎలుగుబంటి తన పిల్లను రక్షించుకునే క్రమంలో ఏకంగా పెద్దపులితోనే పోరాడింది. మహారాష్ట్రలోని తాడోబా-అంధేరి టైగర్ రిజర్వ్‌ ఫారెస్టులో నివసించే ఓ ఎలుగుబంటి తన పిల్లలతో తిరుగుతుండగా అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద పులి ఎలుగు కూనపై దాడి చేసింది. దీంతో ఎలుగుబంటి తన పిల్లను కాపాడుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పులిని బెదిరిండమే కాక పరుగులు పెట్టించింది. ఆ విరోచిత పోరాటానికి పులి తోక ముడిచి పారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story