పిల్లల ముందు తల్లిదండ్రుల గొడవ.. చిన్నారుల భవిష్యత్తు ఆగం...

by Sujitha Rachapalli |
పిల్లల ముందు తల్లిదండ్రుల గొడవ.. చిన్నారుల భవిష్యత్తు ఆగం...
X

దిశ, ఫీచర్స్ : పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడటం వారి మానసిక, భావోద్వేగ పరిస్థితులపై ఎఫెక్ట్ చూపుతుంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే కానీ అలాగని పిల్లల ముందు వాదనకు దిగడం సముచితం కాదని అంటున్నారు. అలా చేయడం వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో వివరిస్తున్నారు.

భావోద్వేగ బాధ

పిల్లలు వాదనను పూర్తిగా అర్థం చేసుకోలేక పోయినా.. ఆ సమయంలో తలెత్తే ఉద్రిక్తత, సంఘర్షణకు సున్నితంగా ఉంటారు. ఇలాంటివి చూడటం ఆందోళన, భయం, విచారం కలిగిస్తాయి. ఆ వాతావరణాన్ని అసురక్షితంగా భావిస్తారు.

బంధం విచ్ఛిన్నం

తల్లిదండ్రులు గొడవ పడటం చూసిన పిల్లలు ఒకరు లేదా ఇద్దరు పేరెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రారంభించవచ్చు. వారిపై గౌరవం తగ్గవచ్చు. వైరుధ్యాల మధ్యలో చిక్కుకున్నట్టు ఫీల్ అయ్యే చిన్నారులు.. భావోద్వేగ ఒత్తిడికి గురవుతారు. ఈ పరిస్థితి కుటుంబంలో బంధాల విచ్ఛిన్నానికి దారితీస్తుంది.

ప్రతికూల ప్రవర్తన

చిన్నారులు తల్లిదండ్రుల వాదనను ఉదాహరణగా తీసుకునే అవకాశం ఉంది. తమ బంధాలలోనూ ఇదే పద్ధతిని పాటించే ఛాన్స్ ఉంటుంది. వారి సామాజిక అభివృద్ధికి ఆటంకం కలిగించే సమస్యలను పరిష్కరించేందుకు కేకలు వేయడం, గొడవ పడటం చేస్తుంటారు. ఇది వారిని నెగిటివ్ గా చూపించే ప్రమాదం ఉంది.

నిర్లక్ష్యం చేయబడిన భావన

వాదించడం తరుచుగా పిల్లల అవసరాలు, ఆందోళనల నుంచి దృష్టిని మారుస్తుంది. వారు నిర్లక్ష్యం చేయబడినట్లు భావించవచ్చు. కాలక్రమేణా వారి మానసిక శ్రేయస్సు, తల్లిదండ్రులతో బంధం ప్రభావితం అవుతుంది. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed