పండగపూట చెట్ల పొదల్లో పసిబిడ్డ.. ఎస్ఐ దంపతులు చేసిన పనికి ప్రసంశల వర్షం

by Mahesh |
పండగపూట చెట్ల పొదల్లో పసిబిడ్డ.. ఎస్ఐ దంపతులు చేసిన పనికి ప్రసంశల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: దసరా పండుగ పూట కండ్లు కూడా నిండని నవజాత శిశువును గుర్తు తెలియని దుండగులు చెట్లపొదల్లో వదిలేసి వెళ్లారు. ఈ విషాద సంఘటన యూపీలోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కళ్లు కూడా తెరవని పసిపాపను చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ పుష్పేంద్ర సింగ్ తన భార్యతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అనంతరం కళ్లు కూడా తెరవని పసికందును చూసి చలించిపోయిన ఎస్ఐ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి పెళ్లై ఆరు సంవత్సరాలు అవుతున్న పిల్లలు కాకపోవడంతో.. చెట్ల పొదల్లో దసరా పండుగ నాడు లభించిన శిశువును దత్తతు తీసుకున్నారు. దసరా పండుగ రోజు దేవుడిచ్చిన వరంగా భావించి దంపతులు క్షణం కూడా ఆలోచించకుండా.. దత్తత తీసుకోవడంతో స్థానికులు ఎస్ఐ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed