ఓటు వేయని వారు ఈ 102 ఏళ్ల వృద్ధురాలిని చూసి నేర్చుకొండి

by Disha Web Desk 12 |
ఓటు వేయని వారు ఈ 102 ఏళ్ల వృద్ధురాలిని చూసి నేర్చుకొండి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజాస్వామ్య భారత దేశంలో ప్రతి పౌరుడి చేతిలో ఉన్న ఎకైక ఆయుధం ఓటు. దేశ ప్రభుత్వాన్ని ఏంచుకునే ఈ ఒక్క ఓటు విలువ కట్టలేనిది. అటువంటి ఓటును ఉపయోగించుకోవడంలో ప్రతి పౌరుడు ముందువరుసలో ఉండాలి. కానీ నేటి సమాజంలోని కొంత మంది క్యూ లైన్‌లో నిలబడలేమని, తమకు డబ్బులు ఇవ్వలేదని, ప్రభుత్వం ఇచ్చిన సెలవను జల్సాల కోసం వాడుకుని ఓట్లు వేయడం లేదు. ఇలాంటి వారి చెంప చెల్లుమనిపించేల ఓ 102 ఏళ్ల బామ్మ చేసింది.

2024 పార్లమెంట్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ లో భాగంగా.. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలోని రెడ్డియార్ చిత్రంలో 102 ఏళ్ల వృద్ధురాలు స్వయంగా తానే నడుచుకుంటూ వచ్చి తన ఓటు హక్కును వినయోగించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా పలువురు ఆ వీడియోను షేర్ చేస్తూ.. దేశంలోని ఓటర్లు అందరూ ఈ బామ్మను చూసి నేర్చుకోవాలని.. కుంటి సాకులు చూపి ఓటు హక్కును వినియోగించుకొకుండా ఉండకూడదని పోస్టులు పెడుతున్నారు.

Next Story

Most Viewed