8వ వేతన సంఘం అప్‌డేట్.. ఆ రోజున కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాల పెంపు..?

by Mahesh |
8వ వేతన సంఘం అప్‌డేట్.. ఆ రోజున కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాల పెంపు..?
X

దిశ, వెబ్ డెస్క్: 8 వ వేతన సంఘం(8th Pay Commission) కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతన పెంపుదలను మోడీ ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఈ 8 వ వేతన సంఘం డిమాండ్ ఉంది. ఈ ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central Government Employees) చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నివేదికల ప్రకారం.. జనవరి 1, 2026 నాటికి కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ధారణ లేదు. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం త్వరలోనే ఈ 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనుందని నివేదికలు సూచిస్తున్నాయి.

7వ వేతన సంఘం గడువు ముగియనున్నందున కొత్త జీతాల నిర్మాణంలో ఉద్యోగులు ఆధునిక జీతాలు, ప్రయోజనాలు, పెన్షన్‌లను పొందుతారు. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని మోడీ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దీని అమలుకు నిర్దిష్ట తేదీని నిర్ణయించలేదు. కాగా ఒకసారి వేతన సంఘం స్థాపించబడిన తర్వాత, కమిషన్ తన సిఫార్సులను రూపొందించడానికి సాధారణంగా 12, 18 నెలల సమయం పడుతుంది. ఉద్యోగుల జీతం, ప్రయోజనాలకు సర్దుబాట్లను సిఫార్సు చేయడానికి, ఈ ప్రక్రియలో ఆర్థిక స్థితి వంటి కొన్ని వేరియబుల్స్‌ను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed