ఇథియోపియాలో అడవులు, రోడ్డు పక్కన ఆశ్రయం పొందుతున్న సూడాన్ శరణార్థులు

by S Gopi |
ఇథియోపియాలో అడవులు, రోడ్డు పక్కన ఆశ్రయం పొందుతున్న సూడాన్ శరణార్థులు
X

దిశ, నేషనల్ బ్యూరో: సూడాన్‌‌‌‌లో ఆర్మీకి, పారామిలిటరీ ఫోర్సెస్ కు మధ్య జరుగుతున్న పోరాటం కారణంగా వేలాది మంది శరణార్థులు బలవుతున్నారు. సూడాన్‌లో ఉన్న ప్రధాన వ్యవసాయ ప్రాంతంలోని ఒక గ్రామంపై సూడానీస్ పారామిలిటరీలు జరిపిన తుపాకీ, ఫిరంగుల దాడిలో డజన్ల కొద్దీ పిల్లలతో సహా కనీసం 104 మంది మరణించారని సూడానీస్ ప్రో-డెమోక్రసీ కార్యకర్తలు తెలిపారు. రాజధాని ఖార్టూమ్‌కు దక్షిణంగా 70 మైళ్ల దూరంలో ఉన్న వాద్ అల్-నౌరా అనే గ్రామంలో బుధవారం జరిగిన దాడి పరిస్థితులు వివాదాస్పదమయ్యాయి. అయితే అధిక మరణాల సంఖ్య, అలాగే సోషల్ మీడియాలో గురువారం ప్రసారం అయిన సామూహిక ఖననం చిత్రాలతో అంతర్జాతీయంగా వ్యతిరేకతలు పెరిగాయి. సూడాన్‌లో ఏడాదిగా సాగుతున్న క్రూర యుద్ధంలో దాడులు ఇప్పుడు అత్యంత చర్చనీయాంసమయ్యాయి. వేలాది మంది సూడాన్ శరణార్థులు పొరుగున ఉన్న ఇథియోపియాలోకి పారిపోయారు. వారి గుడారాలపై బుల్లెట్ దాడులతో ఎగబడటంతో కొందరు అడవుల్లోనూ, రోడ్లపక్కన ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఇథియోపియాలోని ఉత్తర అమ్హారా ప్రాంతంలో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన కుమెర్, అవ్లాలా శరణార్థి శిబిరాలపైనా గత నెల పదేపదే దాడులు కొనసాగడంతో 8,000 మంది ప్రజలు శిబిరాలను వదిలి వెళ్లిపోయారని స్థానిక ప్రతినిధులు రాయిటర్స్‌తో చెప్పారు. గ్రామంపై దాడులు చేయడమే కాకుండా పారామిలటరీ దళాలు గ్రామస్తులను దోచుకుంటున్నాయని మదానీ ప్రతిఘటన కమిటీ ఆరోపణలు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed