- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Odisha: తాంత్రిక వైద్యం.. యువతి తలలోకి 70 సూదులు.. బాబా అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. మూఢనమ్మకాలతో బాబాలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో 19 ఏళ్ల యువతికి వచ్చిన వ్యాధి నయం చేస్తామని ఓ బాబా తాంత్రిక పూజల పేరుతో ఆమె తలలో 70కి పైగా సూదులు గుచ్చాడు. దీంతో మంత్రగాడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని బలంగిర్ జిల్లా సింధైకెలాలో ఒక అమ్మాయి కొన్నేళ్ల క్రితం విచిత్రంగా ప్రవర్తించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు.
అయితే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, ఆమె ఆరోగ్యంగానే ఉందని స్పష్టం చేశారు. అయినా యువతి అలానే ప్రవర్తించడంతో యువతికి దెయ్యం పట్టిందని భావించిన తండ్రి తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆ మంత్రగాడు వైద్యం పేరుతో యువతి తలలోకి ఓ సూదిని చొప్పించాడు. అలా కొన్ని నెలలుగా తాంత్రికుడు సూదులను చొప్పిస్తూనే ఉన్నాడు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి ఇటీవల విషమంగా మారింది. దీంతో కుటుంబసభ్యులు గురువారం రాత్రి బలంగిలో భీమ్‌వోయి మెడికల్ కాలేజీలో చేర్పించారు. అక్కడ సిటీ స్కాన్‌లో యువతి తలలో సూదులు ఉన్నట్లు గర్తించారు.
యువతి తలలో ఉన్న 70కి పైగా సూదులను వైద్యులు తొలగించారు. సిటీ స్కానింగ్ ద్వారా సూదులను గుర్తించిన డాక్టర్లు, రెండు గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్సను నిర్వహించి ఆమెను ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటనకు కారణమైన తాంత్రికుడు ప్రస్తుతం బాబా తేజ్‌రాజ్ రాణా పోలీసుల కస్టడీలో ఉన్నారు.