కేబినేట్ లో ఏడుగురు మహిళలకు చోటు

by Shamantha N |
కేబినేట్ లో ఏడుగురు మహిళలకు చోటు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రదానిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. మోడీతో పాటు మరో 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. ఏడుగురు మహిళలకు మోడీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. కానీ, గతసారి మాత్రం కేబినేట్ లో పదిమంది మహిళలకు చోటు దక్కింది. గతంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన స్మృతి ఇరానీ, డాక్టర్ భారతీ పవార్, సాధ్వి నిరంజన్ జ్యోతి, దర్శన జర్దోష్, మీనాక్షి లేఖి, ప్రతిమా భూమిక్ లకు మంత్రిమండలిలో చోటు దక్కలేదు.

కేబినేట్ లో ఈ ఏడుగురు మహిళలకే చోటు

రాజ్యసభ ఎంపీ నిర్మలా సీతారామన్ మరోసారి మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఆమె పనిచేశారు. ఝార్ఖండ్ కు చెందిన ఓబీసీ నాయకురాలు, బీజేపీ నేత అన్నపూర్ణాదేవి మోడీ మంత్రిమండలిలో చేరారు. మధ్యప్రదేశ్ కు చెందిన గిరిజన నాయకురాలు సావిత్రి ఠాకూర్ కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. గుజరాత్ కు చెందిన బీజేపీ నాయకురాలు నిముబెన్ బంభానియాకు కేబినేట్ లో స్థానం లభించింది. మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సేకు, కర్ణాటకకు చెందిన శోభా కరంద్లాజేలకు కేంద్రమంత్రిపదవి దక్కింది. అప్నాదళ్ నాయకురాలు, కుర్మీ కమ్యూనిటీకి చెందిన నేత అనుప్రియా పటేల్ కేబినేట్ బెర్త్ దక్కించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed