ఆరో దశలో 63.37 శాతం పోలింగ్: ఈసీ

by vinod kumar |
ఆరో దశలో 63.37 శాతం పోలింగ్: ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో జరిగిన పోలింగ్‌లో 63.37 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. 11.13 కోట్ల మంది ఓటర్లకు 7.05 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపింది. ఇందులో పురుషుల ఓటింగ్ శాతం 61.95శాతం కాగా, మహిళలది 64.95శాతంగా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 82.71శాతం ఓటింగ్‌ నమోదుకాగా.. ఉత్తరప్రదేశ్‌లోని 14 నియోజకవర్గాల్లో 54.04శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, ఢిల్లీలో 58.69శాతం, హర్యానాలో 64.80శాతం, ఒడిశాలో 74.45శాతం, జార్ఖండ్‌లలో 65.39శాతం పోలింగ్ నమోదైంది. లోక్ సభ నియోజకవర్గాల వారీగా పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో అత్యధికంగా 85.91శాతం ఓటింగ్ నమోదు కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్‌లో అత్యల్పంగా 48.91శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో ఇప్పటివరకు 69.58 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఢిల్లీలోని ఏడు స్థానాలతో సహా 58 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 25న పోలింగ్ జరిగింది.

Advertisement

Next Story