బీజేడీ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు.. కాషాయపార్టీలో చేరిన మరో ఎంపీ

by Dishanational6 |
బీజేడీ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు.. కాషాయపార్టీలో చేరిన మరో ఎంపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని కటక్ నుంచి ఆరుసార్లు ఎంపీగా ఉన్న భర్తృహరి మహతాబ్ బీజేపీలో చేరారు. ఒడిశా అధికార పార్టీ బిజు జనతాదళ్ నుంచి రాజీనామా చేసిన కొన్ని రోజులకే కాషాయకండువా కప్పుకున్నారు. పార్టీలో అవినీతి పెరిగిపోయిందని.. సంక్షేమ పథకాలు అందించట్లేదని ఆరోపిస్తూ బీజేడీకి రాజీనామా చేశారు మహతాబ్. గత నెలల్లో చాలా మంది బీజేడీ నేతలు అధికారపార్టీపై అసంతృప్తితో కమలదళంలో చేరారు. ఇకపోతే మహతాబ్ బీజేపీ తరఫున లోక్ సభ ఎన్నికల బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో మహతాబ్ బీజేడీ తరఫున పోటీచేసి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రకాష్ మిశ్రాను ఓడించి కటక్ ఎంపీగా గెలిచారు. ఆరుసార్లు కటక్ నుంచే ఎంపీగా గెలుపొందారు. 1998లో తొలిసారి కటక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014లో లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు.

ఒడిశాలో 21 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ అత్యధికంగా 12 స్థానాల్లో గెలవగా.. బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది, కాంగ్రెస్ కు కేవలం ఒక్కసీటే దక్కింది. మరోవైపు, ఈఏడాది ప్రారంభంలో బీజేపీ-బీజేడీ మధ్య పొత్తు కోసం చర్చలు జరిగినప్పటికీ.. రెండు పార్టీలు సీట్ల పంపకంపై అవగాహనకు రాకపోవడంతో విఫలమయ్యాయి.


Next Story

Most Viewed