ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన మరో సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

by Disha Web Desk 7 |
ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన మరో సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో మలయాళ చిత్రాలు మంచి పాపులారిటీని అందుకుంటున్నాయి. దీంతో ఆ సినిమాలను మిగతా భాషల్లో కూడా రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మలయాళంలో మంచి హిట్ అందుకున్న చిత్రాలను తెలుగులో కూడా డబ్ చేశారు. అలా వచ్చిన ‘భమ యుగం’, ‘ప్రేమలు’ వంటి సినిమాలు ఇక్కడ కూడా మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన మలయాళ సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’ కూడా తెలుగులో రిలీజై మంచి సక్సెన్‌ను అందుకుంది.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మంజుమ్మల్ బాయ్స్’ డిజిటల్ స్ట్రీమింగ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు మే 5 నుంచి.. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్‌కు కానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.







Next Story

Most Viewed